Congress: నేడు ఢిల్లీకి... బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!

  • రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పై విమర్శలు
  • నేడు బీజేపీ పెద్దలతో చర్చలు
  • షోకాజ్ నోటీసులు ఇవ్వనున్న కాంగ్రెస్

కాంగ్రెస్ ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి నేటి ఉదయం దేశ రాజధానికి బయలుదేరారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీపై, రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేయగా షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. నేడు తన న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలను కలవనున్న రాజగోపాల్, వారితో చర్చించనున్నారు. ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని ఇప్పటికే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయమని, కాంగ్రెస్‌ పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైందని ఆయన విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పార్టీ రాష్ట్ర నాయకత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగానే రాష్ట్రంలో పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని ఆయన నిప్పులు చెరిగారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అత్యంత దురదృష్టకరమని, కాంగ్రెస్‌ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని కూడా అన్నారు. బీజేపీలో చేరే అంశంపై కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు.  

Congress
BJP
Komatireddy Rajagopal Reddy
  • Loading...

More Telugu News