Lok Sabha: నేటి నుంచి లోక్‌సభ సమావేశాలు.. ఎంపీల ప్రమాణ స్వీకారం.. ఏపీ నుంచి తొలి చాన్స్ ఆమెదే!

  • ఉదయం పది గంటలకు ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం
  • 11 గంటలకు సమావేశాలు ప్రారంభం
  • రేపటి వరకు కొనసాగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం

నేటి నుంచి 17వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలుత ఉదయం 10 గంటలకు బీజేపీ ఎంపీ వీరేంద్రకుమార్‌తో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతాయి. తర్వాత కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ వీరేంద్రకుమార్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నేడు, రేపు రెండు రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

మొదట  ప్రధాని మోదీ, కేబినెట్‌ మంత్రులు, ప్యానల్‌ ఛైర్మన్లు ఎంపీలుగా ప్రమాణం చేస్తారు. తర్వాత ఆంగ్ల అక్షరమాల వరుస క్రమంలో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలుత అండమాన్ నికోబార్ ఎంపీ ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆ తర్వాత ఏపీ ఎంపీలు చేయనున్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ నుంచి తొలుత అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ప్రమాణ స్వీకారం చేస్తారు.  

Lok Sabha
MPs
Andhra Pradesh
parliament
  • Loading...

More Telugu News