Posani Krishna Murali: ఈ రాజకీయాల్లో జగన్ అంతటి అహింసావాది లేరు: పోసాని కృష్ణ మురళి

  • జగన్ ది రాంగ్ రూట్ లో వెళ్లే మనస్తత్వం కాదు
  • జగన్ తన తాత రాజారెడ్డి కంటే ‘టఫ్ మనిషి’  
  • ‘నాకు ఇది కావాలి అని అనుకుంటే’ జగన్ సాధించుకుంటారు

ఏపీ సీఎం జగన్ పై ప్రముఖ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రాజకీయాల్లో జగన్ అంతటి అహింసావాది లేరని కొనియాడారు. ‘టీవీ 9’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాంగ్ రూట్ లో వెళ్లి ఆపని చేద్దాం, ఆ పదవి కొట్టేద్దామనే మనస్తత్వం ఆయనది కాదని అన్నారు.

జగన్ తాత రాజారెడ్డి బాగా మంకుపట్టు పట్టే వ్యక్తి అని, మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అంత మంకు పట్టు పట్టరని అన్నారు. తన తాత రాజారెడ్డి కంటే వంద పర్సెంట్ ‘టఫ్ మనిషి’ జగన్ అని అభిప్రాయపడ్డారు. ‘నాకు ఇది కావాలి అని అనుకుంటే’ జగన్ సాధించుకుంటారని చెప్పారు. తనపై లేనిపోని ఆరోపణలు ఎవరెన్ని చేసినా జగన్ పట్టించుకోలేదని, సత్ప్రవర్తన తనలో ఉంటే జనాలే ప్రేమిస్తారని భావించి ప్రజల్లోకి వెళ్లిన వ్యక్తి అని కొనియాడారు. 

Posani Krishna Murali
YSRCP
cm
jagan
  • Loading...

More Telugu News