Andhra Pradesh: ఏపీలో బీజేపీ బలమైన ప్రతిపక్షంగా నిలవాలని భావిస్తున్నాం: బీజేపీ నేత మురళధర్ రావు

  • పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రయత్నాలు
  • అన్ని ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించాం
  • వచ్చే నెల 6 నుంచి కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఏపీలో తమ పార్టీ బలమైన ప్రతిపక్షంగా నిలవాలని భావిస్తున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని అన్ని ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు. దేశ వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా అడుగులేస్తున్నామని అన్నారు. వచ్చే నెల 6 నుంచి జాతీయ స్థాయిలో కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో జులై 30 నాటికి సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు.    

Andhra Pradesh
bjp
Muralidhar rao
Vijayawada
  • Loading...

More Telugu News