BJP: దావూద్ ఇబ్రహీంకు భయపడుతున్న రాజకీయ నేతలు రామమందిరంపై మాట్లాడటం లేదు!: సుబ్రహ్మణ్యస్వామి

  • హవాలా లావాదేవీలన్నీ డీ-గ్యాంగ్ కనుసన్నల్లోనే
  • ఈ గ్యాంగ్ 339 మంది అమాయకులను చంపింది
  • ట్విట్టర్ లో స్పందించిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు

ఉత్తరప్రదేశ్ లోని బాబ్రీ మసీదును ఓ అల్లరిమూక 1992, డిసెంబర్ 6న ధ్వంసం చేసిందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. కానీ ఇందుకు ప్రతీకారంగా మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని డీ-గ్యాంగ్ ముంబైలో బాంబు పేలుళ్లు జరిపి 339 మందిని బలికొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం చాలామంది రాజకీయ నాయకులు రామమందిర నిర్మాణంపై మాట్లాడటానికే భయపడుతున్నారని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. ఎందుకంటే వీరి హవాలా వ్యవహారాలన్నీ దావూద్ గ్యాంగ్ కన్నుసన్నల్లోనే సాగుతున్నాయని విమర్శించారు. వాటిని డీ-గ్యాంగ్ బయటపెడుతుందన్న విషయంతోనే నేతలు మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు.

BJP
dawood ibrahim
d gang
Police
mumbai blast
babri masjid
  • Loading...

More Telugu News