Andhra Pradesh: విజయవాడ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం!: ఏపీ మంత్రులు ధర్మాన, వెల్లంపల్లి

  • దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి
  • డిసెంబర్ 31 నాటికల్లా పూర్తిచేస్తాం
  • ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రులు

విజయవాడ వాసుల చిరకాల స్వప్నం అయిన దుర్గగుడి ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేశామని ఏపీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ఈ ఫ్లైఓవర్ ను పూర్తి చేస్తామని ప్రకటించారు. విజయవాడ వాసులకు న్యూఇయర్ బహుమతిగా ఫ్లైఓవర్ ను అందిస్తామని చెప్పారు. ఈరోజు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలిపారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించామని చెప్పారు. ఈ ప్రాజెక్టు డిజైన్ ను మార్చడం కారణంగా బడ్జెట్ భారీగా పెరిగిందని వ్యాఖ్యానించారు. దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.10 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు.

Andhra Pradesh
Vijayawada
new year gift
Dharmana Prasad
vellam palli
ministers
  • Loading...

More Telugu News