Manchester: సూర్యుడు కనిపించాడోచ్... మాంచెస్టర్ వెదర్ కండిషన్ ఫొటోలు పెట్టిన వీరేంద్ర సెహ్వాగ్!

  • నిర్మలంగా కనిపిస్తున్న ఆకాశం
  • పరిస్థితి ఆశాజనకంగా ఉందన్న సెహ్వాగ్
  • మ్యాచ్ మధ్యలో వర్షం పడే చాన్స్

నేడు పాకిస్థాన్ తో మ్యాచ్ కి వేదికకానున్న మాంచెస్టర్ లో ఆకాశం నిర్మలంగా ఉందని, సూర్యుడు కనిపించాడని చెబుతూ, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కొన్ని ఫొటోలు తన అభిమానులతో పంచుకున్నాడు. తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టిన సెహ్వాగ్, మాంచెస్టర్ వెదర్ ప్రస్తుతం ఆశాజనకంగా ఉందన్నాడు. ఈ ఫొటోల్లో ఆకాశంలో అక్కడక్కడా మేఘాలు తప్ప, వర్షం కురిపించే దట్టమైన మేఘాలు కనిపించకపోవడం గమనార్హం. అయితే, మ్యాచ్ మొదలయ్యే సమయానికి వరుణుడు వచ్చేస్తాడని బ్రిటన్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మ్యాచ్ మధ్యలో ఒకటి, రెండుసార్లు వర్షం కురుస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.

Manchester
Sehwag
Twitter
Rain
Sun
  • Error fetching data: Network response was not ok

More Telugu News