MAoist: మావోయిస్టుల సంచారం.. పోలవరం ఎమ్మెల్యేకు మంత్రుల స్థాయి భద్రత!

  • పోలవరం నుంచి గెలిచిన వైసీపీ నేత బాలరాజు
  • 2 ప్లస్ 2 భద్రత కల్పిస్తూ తుది నిర్ణయం
  • ఏజెన్సీ ప్రాంతం కావడంతోనే భద్రత పెంపు

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బాలరాజు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాలరాజుకు భద్రతను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ బాలరాజుకు 1 ప్లస్ 1 కేటగిరి భద్రత ఉండగా, తాజాగా దాన్ని 2 ప్లస్ 2 భద్రత పెంచుతూ ఆదేశాలు జారీచేసింది.

ఈ స్థాయి భద్రత మంత్రులకు మాత్రమే ఉంటుంది. బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నది ఏజెన్సీ ప్రాంతం కావడం, ఖమ్మంలోని ముంపు ప్రాంతాలు ఏపీలో విలీనం అయిన నేపథ్యంలో మావోల నుంచి ముప్పు ఉండొచ్చని  నిఘావర్గాలు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే బాలరాజుకు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.

MAoist
West Godavari District
Andhra Pradesh
2 plus 2
security
balaraju
  • Loading...

More Telugu News