West Godavari District: నిరుపేదల గృహనిర్మాణాల కోసం రూ.4 కోట్ల భూమి దానం

  • ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ దాతృత్వం
  • రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రోత్సాహంతో నిర్ణయం
  • లండన్‌ నుంచి వచ్చిన దాత కస్తూరికి మంత్రి అభినందనలు

సెంటు స్థలం పోతుందంటే ఎంతో బాధపడిపోయే ఈ రోజుల్లో ఏకంగా నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే సొంత భూమిని నిరుపేదల ఇళ్ల నిర్మాణం కోసం దానం ఇచ్చి ఆమె శెభాస్‌ అనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామానికి చెందిన పడాల కస్తూరి లండన్‌లో స్థిరపడ్డారు. ఈమెకు పెనుమంట్ర మండలం గర్వులో ఎకరా పది సెంట్లు భూమి ఉంది. ప్రస్తుతం దీని మార్కెట్‌ విలువ నాలుగు కోట్ల పైమాటే అని అంచనా. ఈ భూమిని ఆమె నిరుపేద ఇళ్ల కోసం ప్రభుత్వానికి దానంగా ఇచ్చారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రోద్బలంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం లండన్‌ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఆమె అవసరమైన ఫార్మాలిటీస్‌ పూర్తిచేసి భూమిని మంత్రికి అప్పగించారు. కస్తూరి దాతృత్వాన్ని మంత్రి అభినందించారు.

West Godavari District
penugonda
land donation
4 crores value
  • Loading...

More Telugu News