Pakistan: జాగ్రత్తపడండి... ఉగ్రదాడి జరిగే చాన్స్ ఉందని ఇండియాకు సమాచారం ఇచ్చిన పాకిస్థాన్!

  • దక్షిణ కాశ్మీర్ పై దాడి జరగవచ్చు
  • జాతీయ రహదారిపై దాడికి ప్లాన్
  • ఎన్ఎస్ఏకు వెల్లడించిన పాక్

దక్షిణ కాశ్మీర్ పై ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశాలు ఉన్నాయని, ఎన్ఎస్ఏ (నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్)కు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. ఉగ్రవాద స్థావరాలకు, ఉగ్రవాదులకు నీడ లేకుండా చేయాలని పాక్ పై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగిన వేళ, ఇప్పటికే ఒంటరైన పాక్ నుంచి ఈ తరహా హెచ్చరికలు రావడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. దక్షిణ కాశ్మీర్ హైవేపై ఈ దాడి జరిగే అవకాశాలున్నాయని తమకు సమాచారం అందినట్టు ఎన్ఎస్ఏ వర్గాలు వెల్లడించాయి. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ సంస్థలు ఇండియాపై దాడికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయని, ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలని పాక్ సూచించింది.

Pakistan
India
Terrorists
Attack
NSA
  • Loading...

More Telugu News