Vijayawada: విజయవాడలో రౌడీషీటర్‌ దారుణ హత్య...వేధింపు భరించలేకేనా?

  • సీవీఆర్‌ ఫ్లైఓవర్‌పై కత్తులతో దాడి చేసిన దుండగులు
  • నగరంలోని పలు స్టేషన్లలో మృతునిపై కేసులు
  • బాధితులే ఘోరానికి ఒడిగట్టి ఉంటారని అనుమానం

విజయవాడకు చెందిన కిలారి సురేష్‌ అనే రౌడీషీటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి హత్య చేశారు. నగరంలోని సీవీఆర్‌ ఫ్లైఓవర్‌పై నుంచి వెళ్తున్న ఆయనపై దుండగులు కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. నగరానికి సమీపంలోని జక్కంపూడి కాలనీలో నివాసం ఉంటున్న సురేష్‌పై నగరంలోని పలు స్టేషన్లలో రౌడీషీట్‌ ఉంది. గంజాయి అక్రమ రవాణా, కొట్లాట కేసులు నమోదై ఉన్నాయి. ఈయన వేధింపులు భరించలేక కుమ్మరిపాలెం యువకులు లేక ఇతర బాధితులే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చునని  పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Vijayawada
rowdysheeter
murdered
  • Loading...

More Telugu News