Bihar: బీహార్ లో మరణమృదంగం... మెదడువాపుతో 97 మంది చిన్నారుల బలి!

  • ముజఫర్ పూర్ లో 84 మంది మృతి
  • చికిత్స నిమిత్తం ఆసుప్రతుల్లో చేరిన పలువురు
  • అధికారులతో పరిస్థితి సమీక్షించిన వైద్య మంత్రి

బీహార్ లో మెదడువాపు వ్యాధి మరణమృదంగం మోగిస్తోంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారినపడి చనిపోయిన వారి సంఖ్య 97కు చేరగా, బీహార్ ఆరోగ్య మంత్రి పరిస్థితిని సమీక్షించారు. ఒక్క ముజఫర్ పూర్ లోనే మృతుల సంఖ్య 84గా ఉంది. వైశాలీ ఆసుపత్రిలో 10 మంది, మోతిహారీ ఆసుపత్రిలో ఒకరు, బెగూసరాయ్ ఆసుపత్రిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారని అధికారులు వెల్లడించారు. కాగా, శుక్రవారం నాడు 57గా ఉన్న మృతుల సంఖ్య 24 గంటల్లోనే పెరిగిపోయింది.

ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం చేరిన చిన్నారులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని, ప్రాణనష్టం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య మంత్రి హర్ష వర్ధన్ అధికారులను ఆదేశించారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న ముజఫర్ పూర్ ను తాను సందర్శిస్తానని ఆయన అన్నారు.

Bihar
Brain Fever
Died
Children
  • Loading...

More Telugu News