chevireddy bhaskarreddy: తుడా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి

  • ఆయన మూడేళ్లపాటు పదవిలో ఉంటారు
  • ఇటీవల ప్రభుత్వ విప్‌గా కూడా నియమితుడైన చెవిరెడ్డి
  • చెవిరెడ్డికి భూమన తదితరులు అభినందన

తిరుపతి అర్బన్‌ డెవప్‌మెంట్‌ అథారిటీ (తుడా) చైర్మన్‌గా నియమితులైన చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో మంత్రి పదవి కచ్చితంగా దక్కుతుందని ఊహించిన వారిలో ఒకరైన చెవిరెడ్డికి జగన్‌ జాబితాలో చోటు దక్కలేదు. సామాజిక వర్గాలు, ప్రాంతీయ సమతుల్యతలో ఆయన అవకాశం కోల్పోయారని చెప్పుకున్నారు. మొత్తమ్మీద అసంతృప్తి మొగ్గతొడగకుండా ఆయనను తొలుత ప్రభుత్వ విప్‌గా నియమించిన ముఖ్యమంత్రి జగన్‌, అనంతరం తుడా చైర్మన్‌గా కూడా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వు జారీ చేయడంతో చెవిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ విజయరామరాజు తదితరులు భాస్కరరెడ్డిని  అభినందించారు.

chevireddy bhaskarreddy
TUDA
chairman
sworn
  • Loading...

More Telugu News