India: ఓల్డ్ ట్రాఫోర్డ్ లో తాజా పరిస్థితి దయనీయం... మూడు గంటలకు మ్యాచ్ లేనట్టే!

  • నేడు ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో మ్యాచ్
  • నేడంతా వర్షాలు కురిసే అవకాశం
  • మైదానాన్ని ఆరబెట్టినా తిరిగి వచ్చిన నీరు

నేడు జరగాల్సిన భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. గత రాత్రి భారీ వర్షం కురిసి కాస్తంత తెరిపిచ్చినప్పటికీ, ఈ ఉదయం తిరిగి వర్షం పడుతూనే ఉండటంతో ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం తడిసి ముద్దవుతోంది. గత రాత్రి సూపర్ స్లోపర్లు ఎంతో కష్టపడి, నీటిని తొలగించినా, తిరిగి నీరు చేరింది. దీంతో మరో ఐదు గంటల్లో మ్యాచ్ ప్రారంభం కావాల్సి వుండగా, టాస్ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని గ్రౌండ్ స్టాఫ్ అంచనా వేస్తోంది. పూర్తి మ్యాచ్ సాగే అవకాశాలు నామమాత్రమేనని, వాతావరణం అనుకూలిస్తే, కొన్ని ఓవర్లు కుదించి అయినా మ్యాచ్ సాగవచ్చని వారు అంటున్నారు. అయితే, నేడంతా అప్పుడప్పుడూ జల్లులు కురవవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తుండటం గమనార్హం. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు వాన కారణంగా రద్దు కావడంతో, మ్యాచ్ ల షెడ్యూల్ పై క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఐసీసీపై మండిపడుతున్నారు.

India
Pakistan
Cricket
Old Traford
Match
Rain
  • Loading...

More Telugu News