Krishna District: తరలివచ్చిన విదేశీ భక్తులు... పుష్కరాలను తలపిస్తున్న కృష్ణా తీరం!

  • నేడు రెండో రోజు ఉత్తరాధికారి సన్యాసికారి దీక్ష
  • పుష్కరాలను తలపిస్తున్న కృష్ణా తీరం
  • పోలీసుల భారీ బందోబస్తు

పవిత్ర కృష్ణానదీ తీరం భక్తులతో కిటకిటలాడుతోంది. నేడు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి సన్యాసికారి దీక్ష  రెండో రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉండగా, పెద్దఎత్తున విదేశీ భక్తులు తరలివచ్చారు. వీరితో పాటు వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కృష్ణా తీరం పుష్కరాలను తలపిస్తోంది. గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో సన్యాసికారి దీక్ష కొనసాగుతుండగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రకాశం బ్యారేజ్, దుర్గా ఘాట్, భవానీ ఘాట్, ఉండవల్లి కరకట్ట తదితర ప్రాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో రేపు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో పాటు, ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, నవీన్ పట్నాయక్ తదితరులు పాల్గొననుండటంతో పోలీసులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని కూడళ్లలో వాహనాల రాకపోకలపై నిఘా పెంచారు.

Krishna District
Krishna River
Undavalli
Pushkar
Saradapeetam
  • Loading...

More Telugu News