Galla Jaydev: డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆఫీసుకెళ్లి కలిసిన గల్లా జయదేవ్

  • గౌతమ్ సవాంగ్ కు శుభాకాంక్షలు తెలిపిన గుంటూరు ఎంపీ
  • టీడీపీ కార్యకర్తలపై దాడుల గురించి డీజీపీ వద్ద ప్రస్తావన
  • వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకోవాలంటూ విజ్ఞప్తి

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇవాళ అమరావతిలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆయన కార్యాలయంలోనే కలిశారు. "నా మంచి మిత్రుడికి శుభాకాంక్షలు. శ్రీ గౌతమ్ సవాంగ్ ఇటీవలే ఏపీ రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పోలీసు విభాగం సురక్షితమైన హస్తాల్లో ఉందన్న నమ్మకం కలుగుతోంది" అంటూ గల్లా ట్వీట్ చేశారు. గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఈ భేటీ సందర్భంగా ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణుల దాడులు, దౌర్జన్యాలను అరికట్టాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.

Galla Jaydev
Gautam Sawang
DGP
Andhra Pradesh
  • Loading...

More Telugu News