State Government: తెలంగాణలో ఇకపై సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కి కూడా చెక్ పవర్
- 17 నుంచి అమల్లోకి రానున్న చెక్ పవర్
- సెక్షన్లను నోటిఫై చేసిన ప్రభుత్వం
- నిధులను సమర్థంగా వినియోగించేందుకే నిర్ణయం
గ్రామ పంచాయతీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పంచాయతీల్లో కొత్తగా ఎన్నికైన పాలక వర్గానికి చెక్ పవర్‌ను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకే చెక్ పవర్ ఉండేది. ఇక నుంచి సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కి కూడా చెక్ పవర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
ఈ నెల 17 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు పంచాయతీ రాజ్ చట్టం-2018లోని చెక్ పవర్‌కు సంబంధించిన సెక్షన్లను ప్రభుత్వం నోటిఫై చేసింది. దీని ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరికీ సంయుక్తంగా చెక్ పవర్ లభించనుంది. నిధులను సమర్థంగా వినియోగించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.