Pushpa Srivani: 'అవినీతి పాలన' అందించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి పుష్పశ్రీవాణి.. నెటిజన్ల కామెంట్లు!

  • తొలిసారిగా విజయనగరం జిల్లాకు పుష్ప శ్రీవాణి
  • ముఖ్యమంత్రి ఒకటే లైన్‌లో వెళుతున్నారని వెల్లడి
  • నేతలు అలెర్ట్ చేయడంతో మాట మార్చిన పుష్ప శ్రీవాణి

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా సొంత జిల్లా విజయనగరానికి వెళ్లిన పుష్ప శ్రీవాణి అక్కడ మీడియాతో మాట్లాడుతూ, మాట తడబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు కామెంట్లతో విరుచుకు పడుతున్నారు.

ఒకటే లైన్‌లో తమ ముఖ్యమంత్రి జగన్ వెళుతున్నారని, అవినీతి పాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెబుతున్నారని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. దీంతో వెంటనే ఆమె పక్కనున్న నేతలు అలెర్ట్ చేయడంతో గ్రహించిన పుష్ప శ్రీవాణి అవినీతి రహిత పాలన అందించడమే తమ ప్రభుత్వ థ్యేయమని సరి చేసుకున్నారు.

Pushpa Srivani
Andhra Pradesh
Vijayanagaram
Jagan
Social Media
Viral
  • Loading...

More Telugu News