Hyderabad: బంజారాహిల్స్ లో యువ దంపతుల బలవన్మరణం

  • ఉరి వేసుకుని యువ దంపతుల ఆత్మహత్య
  • మృత దేహాలను పరిశీలించిన పోలీసులు
  • ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే యత్నం

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంనగర్‌లో నివాసముండే ఓ యువ దంపతులు సడెన్‌గా ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగింది. దంపతులిద్దరూ ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు.

Hyderabad
Banjara Hills
Suicide
Young Couple
Police
  • Loading...

More Telugu News