niti aayog: నీతి ఆయోగ్ సమావేశంలో ఐదు నిమిషాలు మాట్లాడనున్న జగన్.. ప్రత్యేక హోదా గురించి వివరించనున్న సీఎం

  • మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ సమావేశం
  • ప్రతి ముఖ్యమంత్రికి మాట్లాడేందుకు ఐదు నిమిషాలు కేటాయింపు
  • సమావేశానికి హాజరుకాని కేసీఆర్, మమత

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం మొదలైంది. ఈ సమావేశానికి నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సీఈవో, సభ్యులు, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా కరవు పరిస్థితి, ఉపశమన చర్యలు, సాగు విధానంలో మార్పులు, వర్షపు నీటి సంరక్షణ, తీవ్రవాద ప్రాంతాలు, మావోయిస్టుల సమస్య, భద్రత అంశాలపై చర్చించనున్నారు. సమావేశంలో మాట్లాడేందుకు ప్రతి ముఖ్యమంత్రికి ఐదు నిమిషాల సమయం కేటాయించారు. తనకు కేటాయించిన సమయంలో ప్రత్యేక హోదా ప్రాధాన్యత గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ వివరించనున్నారు. ఈ సమావేశానికి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకాలేదు.

niti aayog
jagan
meeting
  • Loading...

More Telugu News