Andhra Pradesh: బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పుట్టినరోజు వేడుకలు.. స్వయంగా కేకు తినిపించిన సీఎం జగన్!

  • ఈరోజు సురేష్ పుట్టినరోజని తెలుసుకున్న జగన్
  • కేకు తీసుకురావాలని పార్టీ నేతలకు ఆదేశం
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన జగన్.. రాష్ట్రానికి ప్రత్యేకహోదాను కోరుతూనే ఉండాలని సభ్యులకు సూచించారు. ఈ భేటీ అనంతరం ఢిల్లీలో రోడ్ నంబర్ -1 జన్ పథ్ లోని జగన్ నివాసంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ఈరోజు బాపట్ల లోక్ సభ సభ్యుడు నందిగం సురేష్ పుట్టినరోజు అని తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలకు చెప్పి ప్రత్యేకంగా కేకును తెప్పించారు. అనంతరం జగన్ సమక్షంలో నందిగం సురేష్ కేక్ కోస్తుండగా.. జగన్ ‘హ్యాపీ బర్త్ డే’ అంటూ పాడారు. అనంతరం  స్వయంగా నందిగం సురేష్ కు కేక్ తినిపించారు. ఓ పార్టీ నేత తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరూ చూసేయండి.

Andhra Pradesh
Jagan
Chief Minister
nandigam suresh
Twitter
video
  • Error fetching data: Network response was not ok

More Telugu News