necklace road: నెక్లెస్ రోడ్డులో హిందువులను టార్గెట్ చేసి, దాడులు చేస్తున్నారు: రాజాసింగ్

  • నెక్లెస్ రోడ్డు అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది
  • హిందువులను టార్గెట్ చేస్తున్నారు
  • భద్రత పెంచాల్సిన అవసరం ఉంది

నెక్లెస్ రోడ్డులో జరిగిన దాడిలో గాయపడిన సాయి సాగర్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, సాయి సాగర్ పై దాడి చేసిన మొబిన్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్ అని తెలిపారు. మొబిన్ పై 12 కేసులు ఉన్నాయని చెప్పారు.

 నెక్లెస్ రోడ్డుపై ఒక యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే సాగర్ నిలదీశాడని... ఆ కారణంతోనే దాడికి పాల్పడ్డాడని తెలిపారు. దాడి గురించి తెలుసుకున్న పోలీసులు... ఇద్దరినీ స్టేషన్ కు తీసుకెళ్లారని... అక్కడ కూడా సాగర్ పై మొబిన్ రాయితో దాడి చేశాడని, దీంతో అతను కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. నెక్లెస్ రోడ్ అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని... హిందువులను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. నెక్లెస్ రోడ్డులో భద్రతను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.

necklace road
attack
raja singh
  • Loading...

More Telugu News