Chandrababu: చంద్రబాబును అవమానించేందుకు కుతంత్రాలు చేశారు: బుద్ధా వెంకన్న

  • కేంద్ర పెద్దల సహకారంతోనే తనిఖీలు
  • ప్రజల కంటతడికి కొట్టుకు పోతారు
  • చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారనే విషయం తెలియదా?

కుట్రలో భాగంగా, ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ అధినేత చంద్రబాబును అవమానించారని... రాష్ట్ర ప్రజలు కంటతడి పెట్టుకునేలా వ్యవహరించారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కేంద్ర పెద్దలతో ఢిల్లీలో ఉన్న వైసీపీ నేతలు మంతనాలు జరిపారని... వారి సూచనల మేరకే విమానాశ్రయంలో చంద్రబాబును తనిఖీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారి వెళ్లినప్పుడు చంద్రబాబును ఎందుకు తనిఖీ చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబును అవమానించేందుకు కుతంత్రాలకు పాల్పడుతున్నారని అన్నారు. కౌరవసభలో ధర్మరాజును అవమానించినట్టు చంద్రబాబును అవమానిస్తే... ప్రజల కంటతడికి కొట్టుకు పోతారని చెప్పారు. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ స్పీకర్ కు ధన్యవాదాలు చెప్పినదానికంటే... చంద్రబాబునే ఎక్కువగా విమర్శించారని చెప్పారు.

Chandrababu
budda venkanna
Telugudesam
ysrcp
  • Loading...

More Telugu News