Andhra Pradesh: డాక్టర్లు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించం.. కఠిన చర్యలు తీసుకుంటాం!: ఏపీ మంత్రి ఆళ్ల నాని హెచ్చరిక

  • శిశు మరణాలపై సీఎం విచారణకు ఆదేశించారు
  • గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనూ టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది
  • అమరావతిలో వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిశు మరణాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచారణకు ఆదేశించారని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతిని టీడీపీ ప్రభుత్వం ప్రోత్సహించిందని ఆయన మండిపడ్డారు. డాక్టర్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరిస్తే సహించబోమని హెచ్చరించారు.

అమరావతిలోని తన ఛాంబర్ లో వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీలో రాబోయే రోజుల్లో ‘ఆరోగ్య శ్రీ’ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని మంత్రి చెప్పారు. వైద్య ఖర్చులు రూ.1,000 దాటితే ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్య శ్రీ పథకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలిపారు.

  • Loading...

More Telugu News