Andhra Pradesh: చంద్రబాబు హయాంలో భారీగా అవినీతి జరిగింది.. నా శాఖలో ఇకపై దోపిడీ ఉండదు!: మంత్రి అనిల్ కుమార్

  • వైఎస్ ప్రారంభించిన ప్రతీ ప్రాజెక్టును పూర్తిచేస్తాం
  • జగన్ హయాంలో రైతులు సుభిక్షంగా ఉంటారు
  • జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనిల్

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన ప్రతీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఏపీ జలవనరుల మంత్రిత్వ శాఖను పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. ఏపీ సచివాలయంలో తన ఛాంబర్ లో ఈరోజు అనిల్ కుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పుత్తూరు మున్సిపాలిటీకి తెలుగు గంగ ప్రాజెక్టు నుంచి 1.3 టీఎంసీల నీటి విడుదలకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు.

వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రైతులు సుభిక్షంగా ఉంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని మంత్రి అనిల్ పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో వ్యవసాయశాఖలో భారీ అవినీతి చోటుచేసుకుందనీ, తమ ప్రభుత్వ హయాంలో జలవనరుల శాఖలో దోపిడీ ఉండదని స్పష్టం చేశారు. ప్రతీ టెండర్ ను జ్యుడీషియల్ కమిషన్ ముందు ఉంచుతామని పునరుద్ఘాటించారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Jagan
anil kumar
irregation
minister
  • Loading...

More Telugu News