sonali bindre: సోనాలిబింద్రేను కిడ్నాప్ చేయాలనుకున్నా: షోయబ్ అక్తర్

  • సోనాలి అంటే నాకు చాలా ఇష్టం
  • ఆమె ఫొటోను పర్సులో పెట్టుకునేవాడిని
  • ఆమెకు లవ్ ప్రపోజ్ చేద్దామనుకున్నా

తన అందచందాలతో, నటనతో ఒకప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా సోనాలిబింద్రే చలామణి అయింది. టాలీవుడ్ లో కూడా చిరంజీవి, బాలయ్య, నాగార్జున, శ్రీకాంత్ ల సరసన ఆమె నటించింది. క్యాన్సర్ బారిన పడిన ఆమె... ఇటీవలే అమెరికాలో చికిత్స పొంది, సురక్షితంగా బయటపడింది.

మరోవైపు, సోనాలిబింద్రే గురించి పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. సోనాలి అంటే తనకు ఎంతో ఇష్టమని... ఆమె ఫొటోను పర్సులో పెట్టకుని తిరిగేవాడినని చెప్పాడు. ఆమెకు లవ్ ప్రపోజ్ చేయాలనుకున్నానని... ఒకవేళ ఆమె ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేయాలని అనుకున్నానని సరదాగా వ్యాఖ్యానించాడు.

sonali bindre
shoib akhtar
bollywood
  • Loading...

More Telugu News