Andhra Pradesh: టీడీపీకి ఓటేశారని ఇళ్లలోకి దూరి దాడులు.. గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన పిన్నెల్లి గ్రామస్తులు!

  • మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఘటన
  • టీడీపీకి ఓటేశామని దాడులకు దిగారని ఆరోపణ
  • స్థానిక పోలీసులూ వారికే అండగా నిలుస్తున్నారని ఆవేదన

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పిన్నెల్లి గ్రామస్తులు ఈరోజు జిల్లా గ్రామీణ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) జయలక్ష్మిని కలుసుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేసినందుకు వైసీపీ నేతలు తమపై కక్ష కట్టారని వాపోయారు. రాత్రిపూట తమ ఇళ్లలోకి దూరి దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తమపై దాడిచేసిన వారిని అరెస్ట్ చేయకుండా తమనే ఊరి విడిచి వెళ్లిపోవాల్సిందిగా ఉచిత సలహాలు ఇస్తున్నారని వాపోయారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, వీరి ఫిర్యాదును స్వీకరించిన ఎస్పీ జయలక్ష్మి.. ఈ ఘటనపై విచారణ జరిపి సత్వరం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో పిన్నెల్లి గ్రామస్తులు వెనుదిరిగారు.

Andhra Pradesh
Telugudesam
attacks
YSRCP
Guntur District
sp
  • Loading...

More Telugu News