Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ పదో తరగతి, ఇంటర్ ఫలితాల విడుదల!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-26aa949edd35e6720d4b44da0fdf86797c63276b.jpg)
- విజయవాడలో మంత్రి సురేష్ చేతుల మీదుగా విడుదల
- పదో తరగతిలో 69.93 శాతం ఉత్తీర్ణత
- ఓపెన్ ఇంటర్ లో 41,367 మంది పాస్
ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. విజయవాడలో ఈరోజు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఈ పరీక్షలను నిర్వహించింది. ఓపెన్ పదో తరగతి పరీక్షల్లో 69.93 శాతం ఉత్తీర్ణత నమోదు అయిందని ఆదిమూలపు సురేష్ తెలిపారు.
ఈ పరీక్షల్లో 39,263 మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. అలాగే ఓపెన్ ఇంటర్ లో 67.82 శాతం ఉత్తీర్ణత నమోదు అయిందన్నారు. ఈ పరీక్షల్లో 41,367 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. మరికాసేపట్లో ఈ ఫలితాలను http://www.apopenschool.org వెబ్ సైబ్ లో అప్ లోడ్ చేస్తామని చెప్పారు.