Andhra Pradesh: ఫొటోగ్రాఫర్ ను విమానాశ్రయంలోకి ముందుగానే పంపి చంద్రబాబు ఫొటో తీయించుకున్నారు!: ఐవైఆర్ కృష్ణారావు

  • లేదంటే ఇలాంటి ఫొటోలు బయటకు రావు
  • జడ్ ప్లస్, జడ్ ప్లస్ ప్లస్ అయినా తనిఖీలు తప్పవు
  • ట్విట్టర్ లో స్పందించిన బీజేపీ నేత

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో సాధారణ ప్రయాణికుల తరహాలో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఫొటోగ్రాఫర్ ను ముందుగానే అనుకున్న ప్రాంతానికి పంపి ఈ తనిఖీలను ఫొటో తీయించారని ఐవైఆర్ ఆరోపించారు. లేదంటే ఇలాంటి ఫొటో బయటకు వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

సాధారణ ప్రయాణికుడి నుంచి జడ్ ప్లస్, జడ్ ప్లస్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తులు అయినా సరే తనిఖీలు లేకుండా విమానం ఎక్కలేరని ఐవైఆర్ స్పష్టం చేశారు. అయితే ఈ తనిఖీ బహిరంగంగా చేయాలా? లేక ప్రత్యేకంగా చేయాలా? అన్నది వారివారికి నిర్ణయించిన ప్రభుత్వ మర్యాదను అనుసరించి ఉంటుందని తేల్చిచెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.

Andhra Pradesh
IYR
Twitter
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News