Andhra Pradesh: చంద్రబాబుకు శాపం తగిలింది.. అందుకే ఓడిపోయారు!: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

  • ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేదు
  • జగన్ తెలుగు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు
  • విశాఖలో మీడియాతో మాట్లాడిన యార్లగడ్డ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రముఖ భాషావేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు భాష అభివృద్ధి కోసం ఇచ్చిన ఏ హామీనీ చంద్రబాబు నిలబెట్టుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో యార్లగడ్డ పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఓటమికి తెలుగుతల్లి శాపం కూడా ఓ కారణమని వ్యాఖ్యానించారు. ప్రతీ స్కూలులో తెలుగును తప్పనిసరి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. తెలుగు భాషాభివృద్ధి కోసం జగన్ చేస్తున్న కృషిని అభినందిస్తున్నామని పేర్కొన్నారు.

Andhra Pradesh
Chandrababu
telugu talli
curse
  • Loading...

More Telugu News