Andhra Pradesh: గన్నవరం ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు తనిఖీలపై మాజీ మంత్రి చినరాజప్ప మండిపాటు

  • గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబుకు అవమానం
  • సాధారణ ప్రయాణికుల్లా తనిఖీ
  • ప్రయాణికుల బస్సులో వెళ్లిన మాజీ సీఎం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని గన్నవరం విమానాశ్రయంలో సాధారణ ప్రయాణికులలా తనిఖీలు చేయడంపై మాజీ మంత్రి చినరాజప్ప స్పందించారు. విమానాశ్రయ సిబ్బంది తీరును తప్పుబట్టారు. వీఐపీ, జడ్‌ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబును తనిఖీలు చేయడం దారుణమన్నారు. విమానాశ్రయంలో ఆయనకు ప్రత్యేక వాహనాన్ని కేటాయించకపోవడంపైనా మాజీ హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు భద్రతను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, అందులో భాగంగానే ఇలా సామాన్య ప్రయాణికుల్లా తనిఖీలు చేసి, ప్రయాణికుల బస్సులో పంపించారని ఆరోపించారు. 

Andhra Pradesh
Gannavaram
Chandrababu
airport
  • Loading...

More Telugu News