Andhra Pradesh: చంద్రబాబు తన కంటే చిన్నవాడైన జగన్ ని చూసి నేర్చుకోవాలి: దాడి వీరభద్రరావు

  • పార్టీ ఫిరాయింపులను చంద్రబాబు ప్రోత్సహించారు
  • నైతిక విలువలకు ఆయన తిలోదకాలు ఇచ్చారు
  • టీడీపీ కార్యాలయంలో సీఎం జగన్ ఫొటో పెట్టుకోండి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత దాడి వీరభద్రరావు విరుచుకుపడ్డారు. విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ ఫిరాయింపులకు పాల్పడి నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిన చంద్రబాబు, తన కంటే చిన్నవాడైన జగన్ ని చూసి ఆ విలువలు నేర్చుకోవాలని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ ఫొటో పెట్టుకోవాలని సూచించారు. ఒకవేళ పార్టీ ఫిరాయింపులను జగన్ ప్రోత్సహిస్తే టీడీపీలో ఒక్క చంద్రబాబునాయుడే మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు నైతికవిలువలకు కట్టుబడి ఉండాలని సూచించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని చెప్పిన జగన్ నిర్ణయాన్ని దేశంలోని అన్ని చట్టసభల్లో అమలు చేయాలని కోరారు. 

Andhra Pradesh
Telugudesam
YSRCP
Chandrababu
cm
jagan
Dadi veera Bhadra rao
vizag
  • Loading...

More Telugu News