Father Emiliraj: చర్చి ఫాదర్ ఎమిలిరాజ్‌ అరెస్ట్‌కు హోంమంత్రి సుచరిత ఆదేశాలు

  • బాడీ మసాజ్ చేయాలంటూ బెదిరించిన ఎమిలిరాజ్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లి
  • ఎమిలిరాజ్‌తో కుమ్మక్కై సెటిల్మెంట్‌కి సీఐ యత్నం

ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత చొరవతో ఎట్టకేలకు అనంతపురం జిల్లా తాడిపత్రి చర్చి ఫాదర్‌ ఎమిలిరాజ్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. గతేడాది సెప్టెంబరులో తాడిపత్రికి చెందిన ఓ బాలిక చర్చికి వెళ్లిన సమయంలో ఫాదర్ ఎమిలిరాజ్, ఆ బాలికతో పాటు మరికొందరిని ఇంటికి పిలిపించుకుని నగ్నంగా పడుకుని బాడీ మసాజ్ చేయాలని బెదిరించాడు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే అప్పటి సీఐ సురేందర్‌రెడ్డి, చర్చి ఫాదర్‌తో కుమ్మక్కై ప్రైవేట్ సెటిల్మెంట్‌కి యత్నించారని ఆరోపణలొచ్చాయి. 2019 మార్చి 30న మహిళా కమిషన్ ఆదేశాలతో తాడిపత్రి పోలీసులు ఎమిలిరాజ్‌పై కేసు నమోదు చేశారు కానీ అరెస్ట్ చేయలేదు. ఈ విషయమై బాలిక తల్లి హోం మంత్రి సుచరితను కలిసి తన బాధను వివరించడంతో వెంటనే స్పందించారు. పోలీసులకు ఫోన్ చేసి, చర్చి ఫాదర్‌ను అరెస్ట్ చేయాలని సుచరిత ఆదేశాలు జారీ చేశారు.

Father Emiliraj
Sucharitha
Jayarama Subbareddy
Body Masaj
Surender Reddy
  • Loading...

More Telugu News