Jagan: వర్షాల కోసం 'సన్యాసి దీక్ష' చేయనున్నాం: స్వరూపానంద

  • దుర్గమ్మను దర్శించుకున్న స్వరూపానంద
  • లోక కల్యాణార్థం సన్యాసికారి దీక్ష
  • టీటీడీ లోని ఆగడాలపై పోరాటం చేసిన ఏకైక పీఠం తమదేనన్న స్వామి 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సన్యాసికారి దీక్ష ఏర్పాటు చేయనున్నట్టు స్వరూపానంద సరస్వతి తెలిపారు. నేడు ఆయన బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 15, 16, 17న లోక కల్యాణార్థం సన్యాసికారి దీక్ష చేయనున్నట్టు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు పడాలని ఈ దీక్షను చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ హాజరు కానున్నారని తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయ వ్యవస్థలు, భూములు, టీటీడీ లోని ఆగడాలపై పోరాటం చేసిన ఏకైక పీఠం విశాఖ పీఠమేనని స్వరూపానంద పేర్కొన్నారు.

Jagan
KCR
Narasimhan
Swaroopananda
Vijayawada
Telugudesam
  • Loading...

More Telugu News