ATM: ఏటీఎంలలో నగదు నింపకుండా రోజుల తరబడి ఖాళీగా ఉంచే బ్యాంకులకు జరిమానా

  • ఆర్బీఐ తాజా నిర్ణయం
  • 3 గంటలకు మించి ఏటీఎంలు నగదు లేకుండా ఉండరాదు
  • ప్రాంతాలను బట్టి జరినామా స్థాయి

ఇటీవల కాలంలో చాలా ఏటీఎంలు 'నో క్యాష్' బోర్డుతో కనిపించడం పరిపాటిగా మారింది! ఇకమీదట ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. రోజుల తరబడి ఏటీఎంలలో నగదు నింపకుండా, వినియోగదారులను అసౌకర్యానికి గురిచేసే బ్యాంకులపై కఠినచర్యలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉపక్రమించింది. మూడు గంటలకు మించి ఏటీఎంలు నగదు లేకుండా ఖాళీగా ఉండరాదని, నిర్ణీత వ్యవధి దాటిపోతే బ్యాంకులకు జరిమానా తప్పదని ఆర్బీఐ హెచ్చరించింది. అయితే, ప్రాంతాల వారీగా ఈ జరిమానా స్థాయి ఆధారపడి ఉంటుంది. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలను బట్టి జరిమానా విధించనున్నారు. ఏదేమైనా, ఆర్బీఐ తాజా నిర్ణయం ఏటీఎం వినియోగదారులకు నిస్సందేహంగా తీపికబురేనని చెప్పాలి.

ATM
RBI
BANK
  • Loading...

More Telugu News