Telangana: దేశంలోనే అత్యంత తెలివైన అవినీతి సీఎం కేసీఆర్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

  • కేసీఆర్ పని చేయరు.. ఎవర్నీ చేయనివ్వరు
  • కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టిన అరిష్టం
  • నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వం టేకోవర్ చేయాలి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర ఆరోపణలు, వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత తెలివైన అవినీతి సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. కేసీఆర్ పని చేయరు, ఎవర్నీ పని చేయనివ్వరని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టిన అరిష్టమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే టేకోవర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫ్యాక్టరీ కోసం పెట్టుబడిదారులు ముందుకొస్తే కేంద్రం నుంచి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా అరవింద్ హామీ ఇచ్చారు.

Telangana
cm
kcr
bjp
mp
dharmapuri
  • Loading...

More Telugu News