Andhra Pradesh: సీఎం జగన్ కు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం!: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

  • ఏపీ అభివృద్ధికి అన్నిరకాలుగా సహకరిస్తాం
  • సులభతర వాణిజ్యానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోంది
  • గోయల్ వ్యాఖ్యలను స్వాగతించిన ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అన్నివిధాలుగా సహకరిస్తామని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సులభతర వాణిజ్యం, పారిశ్రామిక పురోభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. నవ్యాంధ్ర అభివృద్ధికి వీలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈరోజు తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. కాగా, ఏపీకి సాయం చేస్తామన్న పీయూష్ గోయల్  వ్యాఖ్యలను ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్వాగతించారు. కేంద్రం సహకారం అందిస్తామని ముందుకు రావడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. జిల్లాల వారీగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్రో కెమికల్ కారిడార్లను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

Andhra Pradesh
Jagan
Chief Minister
piyush goyal
  • Loading...

More Telugu News