Andhra Pradesh: చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు!

  • ప్రభుత్వ పథకాల పేరుతో నిధులను వాడుకున్నారు
  • ఆ మొత్తం వ్యయాన్ని చంద్రబాబు సొంత ఖర్చుల కింద లెక్కకట్టండి
  • ఏపీ హైకోర్టులో రిపబ్లికన్ పార్టీ నేత అనిల్ పిటిషన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు అయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం చంద్రబాబు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని రిపబ్లికన్ పార్టీ అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్ కుమార్ తన పిటిషన్ లో తెలిపారు.

ప్రభుత్వ పథకాల పేరుతో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును వాడుకున్నారని ఆరోపించారు. ఈ నిధుల మొత్తాన్ని చంద్రబాబు సొంత ఖర్చుల కింద జమ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. కాగా, అనిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు సోమవారం విచారించనుంది.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Chief Minister
public funds
misuse
High Court
petition
  • Loading...

More Telugu News