jagan: జగన్ కాళ్ల కింద వంద సార్లు దూరినా కేసీఆర్ కు బుద్ధి రాదు: నారాయణ

  • ఫిరాయింపులను కేసీఆర్ ఆపాలి
  • జగన్ ను చూసైనా నేర్చుకోవాలి
  • మోదీ, అమిత్ షా, కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. వేలాది మంది ఓటర్లు ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే... సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు. జనాలను మోసం చేసే వ్యక్తులు... కుటుంబసభ్యులను అమ్మడానికి కూడా వెనుకాడరని అన్నారు. పార్టీ ఫిరాయింపులకు తాము దూరమని చెప్పిన ఏపీ సీఎం జగన్ ను చూసైనా కేసీఆర్ నేర్చుకోవాలని హితవు పలికారు. జగన్ కాళ్ల కింద వంద సార్లు దూరినా కేసీఆర్ కు బుద్ధి రాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం లేకపోతే ప్రజలే ప్రతిపక్ష పాత్రను పోషిస్తారని చెప్పారు. మోదీ, అమిత్ షా, కేసీఆర్ ముగ్గురూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

jagan
kcr
modi
amit shah
cpi
narayana
  • Loading...

More Telugu News