pcb: ఇండియాను అడుక్కునే ప్రసక్తే లేదు: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు

  • మాతో క్రికెట్ ఆడాలని అడుక్కోం
  • క్రికెట్ సంబంధాలను మెరుగుపరుచుకుంటాం
  • భారత్ లో జరిగే టోర్నీలో మా మహిళల జట్టు పాల్గొంటుంది

ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం మాంచెస్టర్ లో అత్యంత కీలకమైన మ్యాచ్ జరగబోతోంది. దాయాదిదేశాలు ఇండియా, పాకిస్థాన్ లు ఈ మ్యాచ్ లో తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ ఎహ్సాన్ మణి కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో తలపడాలని భారత్ ను తాము అడుక్కోబోమని చెప్పారు.

అసలు తమతో క్రికెట్ ఆడాలని భారత్ నే కాదు... ఏ దేశాన్ని తాము కోరమని అన్నారు. భారత్ తో క్రికెట్ సంబంధాలను గౌరవప్రదమైన రీతిలో మెరుగుపరుచుకోవాలని తాము భావిస్తున్నామని చెప్పారు. నవంబర్ లో ఇండియాలో జరిగే ఐసీసీ మహిళా ఛాంపియన్ షిప్ లో తమ జట్టు పాల్గొంటుందని ఎహ్సాన్ మణి తెలిపారు. 2013 నుంచి భారత్, పాక్ ల మధ్య ఒక్క సిరీస్ కూడా జరగని సంగతి తెలిసిందే. అయితే, వివిధ టోర్నీల్లో మాత్రం తలబడ్డాయి.

pcb
india
ehsan mani
  • Loading...

More Telugu News