Jana Sena: గవర్నర్‌ చెప్పారు సరే...అమలైతేనే ఆనందం: జనసేన ఎమ్మెల్యే రాపాక

  • మాటల కంటే చేతలు అవసరం
  • హామీలన్నీ అమలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది
  • జగన్‌ ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా పనిచేయాలి

ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం భవిష్యత్తు కార్యాచరణను గవర్నర్‌ తన ప్రసంగంలో చక్కగా చెప్పారని, అయితే మాటల కంటే చేతల్లో అభివృద్ధి కనిపించినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ తు.చ తప్పకుండా అమలు చేయడానికి జగన్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

 హామీలు అమలైనప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఆయన వయసు చిన్నదే అయినా బాగానే పరిగెత్తుతున్నారని కితాబిచ్చారు. స్పీకర్‌ను కుర్చీలో కూర్చోబెట్టడం అనే చిన్న అంశం కోసం రాద్ధాంతం అనవసరమన్నారు. సభలో సభ్యులు వాడే పదజాలం హుందాగా ఉండాలని అభిప్రాయపడ్డారు. లేదంటే చట్టసభల్లో విలువైన కాలం ప్రజా సంక్షేమం కోసం కాకుండా ఇటువంటి అనవసర విషయాల కోసం వృథా అవుతుందన్నారు.

Jana Sena
rapaka
governor speech
  • Loading...

More Telugu News