governor speech: మా ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్‌ చెప్పారు...చెప్పింది కచ్చితంగా ఐదేళ్లలో చేస్తాం : బొత్స

  • హామీలన్నీ అమలు చేయాలన్నదానికి కట్టుబడి ఉన్నాం
  • అవినీతి లేని పాలన ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యం
  • విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో ఏం చేయనుందో గవర్నర్‌గారు చెప్పారని, చెప్పింది కచ్చితంగా అమలు చేసి చూపిస్తామని రాష్ట్ర మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉమ్మడి సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ఏం చెప్పామో అదే చేస్తామని తెలిపారు. అవినీతిలేని నీతివంతమైన పారదర్శక పాలన అందించడం జగన్‌ లక్ష్యమన్నారు. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని తెలిపారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. వైద్యం కోసం ఇకపై ఏ నిరుపేద ఇబ్బంది పడాల్సిన పనిలేదని, వెయ్యి ఖర్చు దాటితే ప్రభుత్వమే దాన్ని భరిస్తుందన్నారు. నిర్బంధ విద్య కోసం అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తామన్నారు. రైతాంగం సంక్షేమం కోసం మరిన్ని మెరుగైన పథకాలు అమలు చేస్తామని తెలిపారు. అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చనున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News