Andhra Pradesh: చిన్నారులను ఒళ్లో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయించిన సీఎం జగన్!

  • తాడేపల్లిలోని పెనుమాకలో రాజన్న బడిబాట
  • పాల్గొన్న సీఎం జగన్, విద్యాశాఖ మంత్రి సురేష్
  • చిన్నారులను ఆశీర్వదించిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తాడేపల్లి మండలంలోని పెనుమాక జెడ్పీ పాఠశాలలో ఈరోజు చేపట్టిన ‘రాజన్న బడిబాట కార్యక్రమంలో’ ఏపీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులను ఆశీర్వదించిన జగన్ ఓ బాలుడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయించారు.

అనంతరం మరికొందరు చిన్నారుల చేత కూడా పలక, బలపం పట్టించి అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నారు. పాఠశాలలపై చిన్నారులకు భయం పోగొట్టేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం ఈనెల 12 నుంచి 15 వరకూ రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Andhra Pradesh
Chief Minister
Jagan
rajanna badi bata
  • Loading...

More Telugu News