Andhra Pradesh: గుంటూరులో ‘రాజన్న బడిబాట’.. పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్!

  • విద్యార్థుల్లో భయం పోగొట్టేలా ఆటపాటలు
  • తాడేపల్లిలోని పెనుమాకలో రాజన్న బడిబాట
  • విద్యాశాఖ మంత్రి సురేష్ తో కలిసి పాల్గొననున్న సీఎం

పాఠశాలలవైపు విద్యార్థులను ఆకర్షించేలా ఏపీ ప్రభుత్వం ‘రాజన్న బడిబాట’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తొలి నాలుగు రోజులు పిల్లల్లో స్కూళ్లపై భయం పోగొట్టే విధంగా ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు గుంటూరు జిల్లాలో  జరిగే ‘రాజన్న బడిబాట’ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

తాడేపల్లి మండలంలోని పెనుమాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగే  కార్యక్రమానికి సీఎం హాజరు అవుతారు. ఈ సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. అలాగే విద్యార్థులకు పుస్తకాలు, ఉపకార వేతనాలు అందజేస్తారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటికే పెనుమాకకు చేరుకోగా, మరికాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ కూడా అక్కడకు రానున్నారు.

Andhra Pradesh
Guntur District
rajanna badibaata
Chief Minister
Jagan
YSRCP
adimulapu suresh
  • Loading...

More Telugu News