Crime News: చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్‌ను వేధిస్తున్న పది మంది నిందితుల అరెస్టు

  • సామాజిక మాధ్యమాల్లో శ్రీజ భర్త లక్ష్యంగా పోస్టింగ్స్
  • సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించిన కల్యాణ్‌దేవ్‌
  • బాధ్యులని భావిస్తున్న వారిపై సెక్షన్‌ 67 ఐటీ యాక్ట్‌

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు, సినీ నటుడు కల్యాణ్‌దేవ్‌పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యపోస్టింగ్స్‌ పెడుతూ వేధిస్తున్న కేసులో పది మంది అనుమానితులపై సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. చిరు చిన్న కుమార్తె శ్రీజ భర్త కల్యాణ్‌దేవ్‌ కొందరు పోకిరీల నుంచి ఇటీవల కాలంలో తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌ యాజమాన్యం సహకారంతో వేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించగలిగారు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత ఈ వేధింపులకు పాల్పడుతున్న పది మంది పోకిరీలపై ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67 ప్రకారం కేసు నమోదుచేసి వారిని అరెస్టు చేశారు. 'విజేత' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన కల్యాణ్‌దేవ్‌ ప్రస్తుతం తన రెండో సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News