Tamil Nadu: బెడ్‌రూములోని ఏసీ నుంచి మూడు నెలలుగా బుసబుసలు.. తెరిచి చూస్తే పాము!

  • తమిళనాడులోని పుదుచ్చేరిలో ఘటన
  • మూడు నెలులగా ఏసీని ఆవాసంగా చేసుకున్న పాము
  • పట్టుకుని అడవిలో వదిలేసిన అటవీ సిబ్బంది

ఎలా దూరిందో కానీ పడకగదిలోని ఏసీలో చేరిపోయిందో పాము. మూడు నెలలుగా బుసబుసలు వినిపిస్తుండడంతో ఏదో తేడా ఉందని భావించిన కుటుంబ సభ్యులు ఏసీ మెకానిక్‌కు కబురు పెట్టారు. అతడొచ్చి ఏసీ విప్పడంతోనే ఉలిక్కిపడ్డాడు. అందులో కనిపించిన పామును చూసి భయంతో వణికిపోయారు. తమిళనాడులోని పుదుచ్చేరిలో జరిగిందీ ఘటన.

తెంగాయితిట్టు సాయిజీవా సరోజానగర్‌కు చెందిన ఎలుమలై ఇంట్లోని ఏసీని విప్పి చూసిన మెకానిక్‌కు అందులో రెండు పాము కుబుసాలు, ఓ పాము కనిపించాయి. దీంతో హడలిపోయిన మెకానిక్ వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. వారు రెండు గంటలపాటు శ్రమించి పామును బయటకు తీశారు. ఏసీకి అనుసంధానించే బయటి పైపును సరిగా మూయకపోవడం వల్ల పాము అందులోంచి లోపలికి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. పామును పట్టుకున్న అధికారులు దానిని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News