Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పాట పాడనున్న పూజా హెగ్డే 
  • శ్రీవాస్ దర్శకత్వంలో వెంకటేశ్ 
  • చెన్నైలో రజనీకాంత్ 'దర్బార్'

*  అందాలతార పూజా హెగ్డే ఓ పాట పాడడానికి రెడీ అవుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో పూజ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఓ పాటను ఈ ముద్దుగుమ్మ చేత పాడించడానికి సంగీత దర్శకుడు తమన్ ఆమెను ఒప్పించాడట. త్వరలో దీనిని రికార్డు చేయనున్నట్టు సమాచారం.
*  ఆమధ్య 'సాక్ష్యం' చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీవాస్ త్వరలో సీనియర్ హీరో వెంకటేశ్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. 'దేదే ప్యార్ దే' హిందీ చిత్రాన్ని వెంకటేశ్ హీరోగా సురేశ్ బాబు రీమేక్ చేస్తున్నారు. దీని దర్శకత్వ బాధ్యతలను శ్రీవాస్ కి అప్పగించినట్టు తెలుస్తోంది.
*  సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'దర్బార్' చిత్రం షూటింగ్ చెన్నైలో కొనసాగుతోంది. ఆగస్టు నెలాఖరుకల్లా దీని షూటింగ్ పూర్తవుతుందని దర్శకుడు చెప్పారు. ఇందులో నయనతార, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Pooja Hegde
Allu Arjun
venkatesh
Rajanikanth
Nayanatara
  • Loading...

More Telugu News