spice jet: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. కోల్‌కతా విమానాశ్రయంలో విమానం అత్యవసర ల్యాండింగ్
- విమానం ముక్కు భాగాన్ని ఢీకొట్టిన పక్షి
- ప్రయాణికులు సేఫ్
- దెబ్బతిన్న విమానం ముందు భాగం
దిబ్రూగఢ్ నుంచి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం ఒకటి కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానం ముందు భాగాన్ని ఓ పక్షి ఢీకొట్టడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతించాల్సిందిగా కోరాడు. ఏటీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో విమానాన్ని ల్యాండ్ చేశాడు. విమానంలో ప్రయాణిస్తున్న అందరూ క్షేమంగా ఉన్నట్టు స్పైస్‌జెట్ తెలిపింది.
విమానాన్ని పరీక్షించిన ఇంజినీర్లు దాని ముక్కు భాగం దెబ్బతిన్నట్టు గుర్తించారు. రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి వస్తున్న స్పైస్ జెట్ విమానం టైరు గాలిలోనే పేలింది. అయితే, పైలట్ చాకచక్యంగా వ్యవహరించి జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జాగ్రత్తగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.