Andhra Pradesh: ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పేరు ‘వైఎస్సార్ ఆరోగ్య శ్రీ’ గా మార్పు

  • ‘ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్’ పేరు ‘వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్’గా మార్పు
  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ
  • వైఎస్సార్ ఆరోగ్య శ్రీ’ అమలుకు ప్రత్యేక కమిటీ

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పేరును ‘వైఎస్సార్ ఆరోగ్య శ్రీ’ గా మార్పు చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్’ పేరును ‘వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్’గా మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ‘వైఎస్సార్ ఆరోగ్య శ్రీ’ అమలుకు ప్రత్యేక కమిటీ నియమించారు. మాజీ ఐఏఎస్ కె.సుజాతరావు అధ్యక్షతన 9 మంది వైద్య నిపుణులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.

Andhra Pradesh
NTR Health
ysr aarogya sri
  • Loading...

More Telugu News