YSRCP: టీడీపీ సభ్యులు ఎంత రెచ్చగొట్టినా మేము సంయమనం పాటిస్తాం: వైసీపీ నేత కోటంరెడ్డి

  • టీడీపీ సభ్యులు శ్రుతి మించితే స్పీకర్ చర్యలు ఉంటాయి
  • ప్రజలు నమ్మకంతో మాకు ఓటేశారు
  • 2024లో మా పని తీరు చూసి ప్రజలు ఓటేయాలి

అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనం పాటిస్తామని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ‘టీవీ 9’ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ సభ్యులు మరీ శ్రుతి మించితే కనుక సభా నియమాల ప్రకారం స్పీకర్ చర్యలు తీసుకుంటారని చెప్పారు.

2019లో ప్రజలు నమ్మకంతో తమకు ఓటు వేశారని, 2024లో తమ పనితీరు చూసి ప్రజలు ఓటేయాలని, అధికారం చేతికొచ్చిందని ఎవరూ అహంకార పడొద్దని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, నిత్యం ప్రజల్లో ఉండాలని, ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించాలని, అవినీతి లేని సమాజాన్ని అందించాలని తమ అధినేత జగన్ తమకు పదేపదే చెబుతుంటారని అన్నారు. ఆ మాటకు కట్టుబడతామని, సభా సంప్రదాయాలను గౌరవిస్తామని, అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు చేస్తామని, ప్రతిపక్షం కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

YSRCP
cm
jagan
Telugudesam
kotam reddy
  • Loading...

More Telugu News